పయనించే సూర్యుడు మే 10 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి యుద్ధ భూమిలో వీర మరణం పొందిన ఇండియన్ ఆర్మీ జవాన్ ఎం. మురళీ నాయక్ గారి శనివారం బొమ్మనపల్లి విద్యుత్ సిబ్బంది చిత్రపటానికి పూలమాలలు వేసి కొవ్వత్తులతో వెలిగించి నివాళులు అర్పించి శ్రద్దాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో బొమ్మనపల్లి ఏఈ పిండిపోలు బుజ్జికన్నమ్య మాట్లాడుతూ ,మురళి నాయక్ దేశం కోసం తన ప్రాణ త్యాగం చేశాడని మురళి నాయక్ కుటుంబానికి తన ప్రగాడ సంతాపాన్ని తెలియజేశారు, యుద్ధభూమిలో రాత్రి పగలు తేడా లేకుండా మనం కోసం మన దేశం కొరకు వారి సేవ చేస్తున్నారని గుర్తు చేశారు. అనంతరం జై భారత్ జై హింద్ అనే నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో బొమ్మనపల్లి సిబ్బంది బి.దేవ్ సింగ్, డి. చరణ్, ఎస్.కె పాషా, ఎస్.కె .యాకుబ్ పాషా, బి. ప్రవర్ధన్ కుమార్, శ్రీనివాస చారి, నాగల్ మీరా, లచ్చు, పాల్గొన్నారు.