పయనించే సూర్యుడు ఆగస్టు, 25:- ప్రతినిధి ప్రత్తిపాడు నియోజవర్గం ఇంచార్జ్ ఎం. రాజశేఖర్ ) కాకినాడ జిల్లా మహిళా విభాగం ఇంచార్జిగా నియమితులైన కర్రా జయ సరిత ధర్మవరం గ్రామంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్సిపి నాయకులు,నరసాపురం పార్లమెంటు పరిశీలకులు,ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీ కృష్ణంరాజుని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు.రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న జయ సరిత కాకినాడ జిల్లా మహిళా విభాగం ఇంచార్జిగా కర్రా జయ సరిత నియామకం కావడంతో ముదునూరి మురళీకృష్ణంరాజు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఏ సందర్బంగా ఆమె మురళీకృష్ణంరాజుని మహిళా విభాగం పటిష్టతకు సహకారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు వర్దినీడి సుజాత ,పశ్చిమ గోదావరి జిల్లా వైసిపిఉపాధ్యక్షుడు జోగాడ ఉమామహేశ్వరరావు,పశ్చిమ గోదావరి జిల్లా జనరల్ సెక్రెటరీ దేవా రాజేష్,వైస్సార్సీపీ సీనియర్ నాయకులు మామిడిశెట్టి చిట్టిబాబు,రామానుజుల చిన్నమధు తదితరులు పాల్గొన్నారు.