పయనించే సూర్యుడు: ఫిబ్రవరి 18: ములుగు జిల్లా వాజేడు మండల ప్రతినిధి. రామ్మూర్తి.ఎ. వాజేడు: ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్, గోపాలరావు మంగళవారం (ఫిబ్రవరి 18)న వాజేడు మండల పరిధిలోని పేరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరియు ఏహెచ్ఎస్ పాఠశాలను సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సిబ్బంది అందరికీ సమావేశం చేసి అన్ని జాతీయ కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించారు. అనంతరం గత ఆదివారం పేరూరు ఆశ్రమ ఉన్నత పాఠశాల యందు 8వ తరగతి చదువుతున్న సోయం వినీత్ s/o రామారావు, మరణించగా,ఆ విషయమై విచారణలో భాగంగా ఏ హెచ్ ఎస్ పాఠశాల నందు పిల్లల యొక్క సిక్ రిజిస్టర్ను తనిఖీ చేసి పిల్లలకు ఏమేమి జబ్బులు వస్తున్నాయి వాటిని ఎలాంటి మందులు ఇస్తున్నారో అలాగే రిఫరల్ సేవలు ఏ విధంగా అందుతున్నవి వాటి గురించి అన్ని అడిగి తెలుసుకుని, తగు సూచనలు చేశారు. అంతే కాకుండా పిల్లల వసతిగృహాన్ని సందర్శించి వంటశాలను పరిశీలించారు .అలాగే పిల్లల్ని నిద్రిస్తున్న గదలను కూడా పరిశీలించి విద్యార్థులకు దోమల భారీ నుండి రక్షించుకొనుటకు దోమతెరలు వాడవాలని కిటికీలకు జాలీలు వాడాలని తెలియజేశారు. పదవ తరగతి చదువుతున్న పిల్లలకు పరీక్షలు సమీపిస్తున్న వేళ మానసికంగా ఏ విధంగా దదృఢంగా ఉండాలి పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలి అనే విషయాలని తెలియపర్చారు. మృతి చెందిన సోయం వినీత్ ఇంటిని సందర్శించి ఆ మృతికి గల కారణాలను తల్లి మరియు మేనమామ మరియు తాతయ్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోపాలరావు, డి.ఏం.హెచ్.ఓ.ములుగు, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చంద్రకాంత్, పి.ఓ. ఎంసీవీబీడీసీ,టీబీ, డాక్టర్ యోషిత , హెచ్.ఈ.ఒ. వేణుగోపాలకృష్ణ, పి.హెచ్.ఎన్. సంగీత,స్టాఫ్ నర్స్ అనూష , పి.హెచ్.జి.ఎం .నారాయణ, హాస్టల్ వార్డెన్ శ్రీను, ఎమ్మెల్ హెచ్ పి నవీన్ తదితరులు పాల్గొన్నారు.