
పయనించే సూర్యుడు న్యూస్, మార్చి 14 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ముస్లిం మైనార్టీల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ పేర్కొన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా “ఈద్ కా తోఫా” కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.టీపీసీసీ జెడ్ వాజిద్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బండి రమేష్ ముస్లిం మహిళలకు ఈద్ కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ ముస్లింలకు ఎంతో పవిత్రమైనది అని, ఈ పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. అందరూ సుఖశాంతులతో పండుగను జరుపుకోవాలని ఆయన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మోయిజ్, మోయునుద్దిన్, విటల్ రెడ్డి, సుంకన్న, సాయి తులసి, కనకయ్య, అహ్మద్, జమీర్, రాజశేఖర్, నరసింహ యాదవ్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.
