పయనించే సూర్యుడు మార్చి 1 మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండ దండగా ఉంటుందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు రేపటి నుంచి ప్రారంభం కానున్న పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మసీదుల వద్ద అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా కోరుతూ నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున శనివారం బాలనగర్ పార్టీ కార్యాలయంలో రమేష్ ని కలిశారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో మసీదుల వద్ద అవసరమైన విద్యుత్తు తాగునీరు రహదారులు పారిశుద్ధ్యం వంటి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఎక్కడ ఎలాంటి అసౌకర్యo కలగనివ్వబోమన్నారు ప్రభుత్వ సహాయంతో పూర్తిస్తాయిలో అన్నిసౌకర్యాలు కల్పిస్తామన్నారు ఈ కార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు డివిజన్ అధ్యక్షులు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు