
పయనించే సూర్యుడు అక్టోబర్ 09 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
పేరుకే మెనూ పాటించని హెచ్ఎం మరియు వార్డెన్
విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం సమర్ధవంతంగా నిర్వహిస్తున్నటువంటి భోజనం మెనూ లో లోపాలు పిల్లలకు అందవలసిన కనీస సౌకర్యాలు అందించడం లేదు ఉదయం పెట్టవలసిన టిఫిన్ సక్రమంగా పెట్టడం లేదు బొండాలు టిఫిన్ పెట్ట లేదు, మధ్యాన్నం పెరుగు పెట్ట లేదు, పిల్లలు అయ్యో రామ అంటూ బ్రతుకు తున్నారు భోజనం విషయంలో నాసిరకం గా కూరగాయలు సాలిసాలని భోజనం ఉడికే ఉడకని అన్నం పిల్లలకు పెట్టడం జరుగుతుంది
పాఠశాలల్లో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి
వాళ్లకు జరుగుతున్న అన్యాయం గురించి ఎవరికి చెప్పాలో తెలియని అయోమయ స్థితిలో విద్యార్థుల పరిస్థితి ఎవరికి చెప్తే ఎవరూ వాళ్ళని దండిస్తారని భయం భయంగా రోజులు గడుపుతున్నారు
పాఠశాలల్లో ఉన్నటువంటి టాయిలెట్ పరిస్థితి
విద్యార్థులు ఉపయోగించుకోవాల్సిన టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉంది అందులో వాటర్ లీకేజీ సరైన బకెట్లు మగ్గు లాంటివి పిల్లలకి అందుబాటులో లేదు
పాఠశాలల్లో భోజనం చేసే ప్రదేశం
విద్యార్థులు భోజనం చేయటానికి ప్రత్యేకమైన గదులు అంటూ ఏమీ లేదు వారు ఎక్కడపడితే అక్కడ భోజనం చేయవలసి వస్తుంది. చెత్తచెదరాల మధ్యన కూర్చొని భోజనం చేసే పరిస్థితి ఏర్పడింది వారిని చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది ఇట్టి విషయమై వార్డెన్ వివరణ అడగ్గా వారికి ప్రత్యేకమైన గదులు అంటూ ఏమీ లేదు ఉన్న ప్రదేశంలోనే భోజనం చేయవలసి ఉంటుంది అని జవాబు ఇవ్వడం జరిగింది
పాఠశాలల్లో పరిసరాల ప్రభావం
విద్యార్థులు నిత్యం పాఠశాలల్లోనే ఉండవలసి ఉంటుంది హాస్టల్ పాఠశాల అంతా ఒకేచోట ఉండడం అలాగే ఆ పాఠశాల పరిసరాల ప్రాంతం అపరిశుభ్రంగా ఉంది ఎక్కడ చూసినా చెత్తాచెదారం కుప్పలుగా పడి ఉన్నాయి అలాగే గడ్డి కూడా ఎక్కువగా ఉంది అసలు జిల్లా అధికారులు ఇట్టి పాఠశాలను పరిశీలిస్తున్నారా లేదా అనే అనుమానాలు వస్తున్నాయి
పాఠశాలల్లో విద్య అభ్యసించే ఉపాధ్యాయుల ఘనత
పాఠశాలల్లో విద్యను అభ్యసించే ఉపాధ్యాయులు ఏ ఒక్కరు కూడా రాత్రి సమయంలో పిల్లలతో పాటు ఉండడం లేదు ఉండవలసినటువంటి హెచ్ఎం మరియు వార్డెన్ అందుబాటులో పిల్లలకి రాత్రి సమయంలో ఉండడం లేదు వార్డెన్ ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి రాత్రి 8 గంటల లోపు వెళ్లిపోవడం జరుగుతుంది పిల్లలు ఒక్కరే రాత్రిపూట భయం భయంగా బిక్కుబిక్కుమంటూ నిద్ర పోవాల్సి వస్తుంది వారికి రాత్రి సమయంలో జరగరాని ఏమైనా సమస్య ఏర్పడితే ఎక్కడికి వెళ్లాలో కూడా దిక్కుతోచని పరిస్థితిలో వారి యొక్క బాల్య జీవితాన్ని గడపవలసి వస్తుంది మరి ఇటువంటి హెచ్ఎం మరియు వార్డెన్ పై చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు ఉన్నతాధికారులు అనేది అర్థం కావడం లేదు
గతంలో ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ ని మార్చడానికి గల కారణాలు
గతంలో ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ పిల్లలతో మంచి పరిచయం పెంచుకొని పిల్లలతోనే ఉండే స్వభావం గల వ్యక్తి అటువంటి హాస్టల్ వార్డెన్ ని కావాలని కక్షపూరితంగా ఇప్పుడు ఉన్నటువంటి హెచ్ఎం మరియు వార్డెన్ వారిని తొలగించి వారి స్థానంలో వార్డెన్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు ఎందుకంటే పిల్లలతో మంచి పరిచయాలు ఉండటం వల్ల హెచ్ఎం తను చేయవలసిన కార్యకలాపాలు జిల్లా అధికారులకు తెలియజేస్తారేమో అని ముందుగానే పధకం ప్రకారము గతంలో ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ ని తొలగించడం జరిగింది
పాఠశాల హెచ్ఎం మరియు హాస్టల్ వార్డెన్ గా విధులు
హెచ్ఎం మరియు వార్డెన్ పిల్లలకి అందుబాటులో హాస్టల్లో ఉండవలసి ఉంటుంది కానీ ఈ హాస్టల్ వార్డెన్ మాత్రం మూల పోచారం నుండి ఏన్కూర్ కేంద్రంలో ఉంటున్నారు ఏన్కూరు నుండి మూలపోచారం హాస్టల్ కి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో నివాసం ఉంటున్నారు మరి ఇలాంటి హాస్టల్ వార్డెన్ పై ఉన్నతాధికారుల చర్యలు ఉండవా ఏన్కూర్ మండలం మూలపోచారం ఆశ్రమ గిరిజన పాఠశాలలో ఎక్కడ చూసినా చెత్తాచెదారంతో కుప్పగా పేరుకుపోయే ఉన్నాయి వాటిని పరిశుభ్రం చేసేవారే కరువయ్యారు అదే ప్రదేశంలో పిల్లలు ఆ చెత్తచెదారంలోనే భోజనం చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోయే లా ఉంది అదే హాస్టల్ వార్డెన్ కు సంబంధించిన పిల్లలు అలాంటి పరిస్థితులలో భోజనం చేస్తారా వారికి కనపడటం లేదా అపరిశుభ్రత కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్న అపరిశుభ్రత పట్టించుకోని హాస్టల్ వార్డెన్ అంతకుముందున్న హాస్టల్ వార్డెన్ ని కావాలని తొలగించి ప్రస్తుతము పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపాల్ వార్డెన్ గా చార్జ్ తీసుకోవడం జరిగింది తీసుకున్న కానుండి పిల్లల పరిస్థితి గోరంగా అతి ఘోరంగా ఉంది ఇట్టి విషయమై విద్యార్థులను వివరణ కోరగా మా హాస్టల్ కి సంబంధించిన హెచ్ఎం ఉదయం 8 గంటలకి పాఠశాలకి వస్తారు రాత్రి 8 గంటల సమయంలో వెళ్ళిపోతారు రాత్రి వేళల్లో మా వద్ద ఏ ఒక్కరు కూడా ఉండి మా మంచి చెడులను చూసుకునే వారే కరువయ్యారు రాత్రి సమయంలో మేము భయం భయంగా నిద్ర పోవాల్సి వస్తుంది మా మంచి చెడు చూసేవారు లేరు పాఠశాలకు వచ్చే ఉపాధ్యాయులు అంతా బయట ఖమ్మం దూర ప్రాంతం నుండి వచ్చే వారే ఇక్కడ ఏ ఒక్కరు కూడా ఉండడం లేదు దీని గురించి పట్టించుకునే అధికారుల కరువయ్యారు పాఠశాలలో భోజనము వండేవారు లేకపోవడం వల్ల బయట ప్రవేట్ వ్యక్తులను పెట్టి పాఠశాలలో వంట చేపించడం జరిగింది కానీ అట్టి భోజనాన్ని పిల్లలకు పెట్టే క్రమంలో పిల్లల చేతులతోనే భోజనము పెట్టించడం జరుగుతుంది ఇదేంటనీ హాస్టల్ వార్డెన్ నీ వివరణ కోరగా మా పరిస్థితి బాగోలేదు ఏం చేయమంటారు ఏదో ఒకటి నడిపిస్తున్నాను కదా కొన్ని పాఠశాలలో చూస్తే భోజనం కూడా పెట్టించేవారు లేరు నేను ఈ మాత్రమైనా చేస్తున్నానని ధీమాగా జవాబు ఇవ్వడం జరిగింది అట్టి పాఠశాలకు సంబంధించి టాయిలెట్స్ లు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయి పాఠశాలకు సంబంధించిన భోజన మెనూ ప్రకారం నిర్వహించడం లేదని విద్యార్థులు తెలియజేయడం జరిగింది ప్రస్తుతము పాఠశాల తెరవబడి నాలుగు రోజులు గడుస్తున్న కానీ అట్టి పాఠశాలలో మొత్తం 150 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతము 40 మంది ఉన్నారు మరి మిగిలిన వారు ఎందుకు రావట్లేదు అనేది ఒక ప్రశ్నగానే మిగిలిపోయింది ఏది ఏమైనా గానీ ప్రస్తుతము ఉన్నటువంటి హాస్టల్ వార్డెన్ పనితీరు ఏమీ బాగోలేదు అని విద్యార్థులు తెలిపినటువంటి సమాచారం మూల పోచారం ఆశ్రమ గిరిజన పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ నిరుపేద కుటుంబానికి చెందిన వారే వారి పట్ల నిర్లక్ష్యం విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం పెట్టవలసిన వారి యొక్క ఆహార విషయంలో నిర్లక్ష్యం నాసిరకం కూరగాయలు సాలి సాలని విధంగా భోజనము పెట్టడం జరుగుతుంది మరి ఇలాంటి హెచ్ఎం మరియు వార్డెన్లపై జిల్లా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అర్థం కాని దుస్థితి ఒకవైపు హెచ్ఎం గా ఉంటూ మరోవైపు హాస్టల్ వార్డెన్ గా విధులు నిర్వర్తిస్తూ ఒకే వ్యక్తి రెండు విధులను నిర్వర్తిస్తున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకే వ్యక్తి రెండు విధులను సమర్థవంతంగా నిర్వహించగలడా అనేది కూడా ఉన్నతాధికారులు పరిశీలనలో తీసుకోవాలి ఒకే వ్యక్తి రెండు విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు కావున వారిని ఏదో ఒక పదవిలో కొనసాగేటట్టు చూసి పిల్లలకు అందవలసిన పోషకాహారం సమర్థవంతంగా అందే విధంగా జిల్లా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుకుంటున్నారు

