పయనించే సూర్యుడు అక్టోబర్ 23,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టి అందులో భాగంగా తొలిదశలో ఐదు మెడికల్ కళాశాలలను విజయవంతంగా ప్రారంభించి నేటికీ ఆ కళాశాలలో వైద్య విద్య కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత వైసీపీ ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం ఎంతో దుర్మార్గమైన చర్య అని, ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు నేడు నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నేతృత్వంలో నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్ నందు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సిపి నాయకుడు నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్, వైసిపి కౌన్సిలర్లు వైఎస్ఆర్సిపి నాయకులు లతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ మరియు వైసిపి కౌన్సిలర్లు మాట్లాడుతూ… పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వైద్య సేవలను అందించేందుకు రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి 17 నూతన మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ఇందులో భాగంగా తొలి దశలో 5 మెడికల్ కళాశాలలను ప్రారంభించి కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. మరికొన్ని మెడికల్ కళాశాలలో నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో వాటిని కూటమి ప్రభుత్వం కొనసాగించకుండా అడ్డుకుంటూ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేడు కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించామని తెలిపారు.ఈ ఉద్యమానికి ప్రజలు కార్యకర్తలు నాయకులు తమ పూర్తి మద్దతును ఇవ్వడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో కోటి సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ ను కలిసి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామని తెలియజేస్తూ వైద్య విద్యార్థులకు న్యాయం చేయాలని కోరడం జరుగుతుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కౌన్సిలర్ లు సాదిక్ బాష, సమ్మద్, ఆరీఫ్ నాయక్, కలామ్ ,బాషా, తమీమ్, మజీద్, వైసీపీ నాయకులు అనిల్ అమృతరాజ్,మున్నయ్య,కన్నమ్మ,,లక్ష్మీనారాయణ, కిరణ్ కుమార్, కత్తి శంకర్, దండే సుధాకర్, గన్ని కరీం, మాజీ మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్ చుమ్మా నాగన్న, సోహెల్ రానా, జుబేర్, చాంద్ బి, కుమ్మరి రాముడు, ఎర్రన్న, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.