పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 16, ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ.
పట్టణ శివారు ఆరెకల్ గ్రామ సమీపంలో నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ప్రైవేటీకరణ చేయడం దుర్మా ర్థమని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రంగప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు సోమవారం ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల రహదారిపై ధర్నా నిర్వహించడం జరిగింది ప్రభుత్వం గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలను అందించాలన్న ఉద్దేశంతో ఆదోనిలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కళాశాల పనులను నిలిపివేసి పీపీపీ(పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ ) పద్ధతిలో కొనసాగించడానికి క్యాబినెట్ తీర్మానం చేయడం అన్యాయమన్నారు. ప్రైవేటీకరణతో పేదలకు వైద్యం అందే పరిస్థితి ఉండదని ప్రభుత్వమే వైద్య కళాశాలను నడపాలని డిమాండ్ చేశారు. పీపీపీ విదానాన్ని రద్దు చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శశిధర్, నాయకులు రిషి, మోహన్, రాజు ,మహేష్,తేజ, మహేష్ తదితరులు పాల్గొన్నారు