పయనించే సూర్యుడు మార్చి 9 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మెదక్ జిల్లా చిన్నశంక రంపేట మండలంలోని గ్రామాల్లో శనివారం సాయంత్రం పది వేల కోళ్లు అంతుచిక్కని వ్యాధితో మృతి చెందాయి. గవ్వపల్లి, జంగరాయి గ్రామాల్లోని కోళ్ల ఫాంలలో కళ్ల ఎదుటే వ్యాధికి గురైన కోళ్లు మృతి చెందడంతో ఫాంల యజమానులు కన్నీటి పర్యంతమయ్యారు. వైరస్ సోకడంతో వారం రోజుల నుంచి భారీ సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయని వాటి పోషణదారులు సంగెం జనార్ధన్, ఆరె యాదగిరి, మినిపూరి భూపాల్‌రెడ్డి వాపోయారు. కాగా మృతి చెందిన కోళ్లను భూమిలో పూడ్చేశారు. రూ.లక్షల్లో నష్టం వాటిల్లిం దని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు.