పయనించే సూర్యుడు మార్చి 6 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు.
మెదడువాపు వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ఆర్ధిక సహాయం అందించిన వికాస్ టెక్నో పాఠశాల యాజమాన్యం మరియు విద్యార్థులు. స్థానిక వికాస్ టెక్నో పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న విస్సన్నపేట గ్రామానికి చెందిన ఐశ్వర్య మెదడువాపు వ్యాధి తో బాధపడుతున్నది. నిరుపేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చుల నిమిత్తం ఇబ్బందిపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వికాస్ విద్యాసంస్థల అధినేత శ్రీ యన్ నర్సిరెడ్డిగారు విద్యార్ధులు మరియు ఉపాధ్యాయుల నుండి విరాళాలు సేకరించవలసినదిగా ఆదేశించారు. వికాస్ విద్యాసంస్థల యాజమాన్యం, పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు విద్యార్ధికి .80,000/-లు సహాయం చేయటం జరిగింది. ఈ సందర్భంగా వికాస్ విద్యా సంస్థల డైరెక్టర్ శ్రీమతి వేమనకుమారి గారు మాట్లాడుతూ కష్టాలలో ఉన్నవారికి సహాయం చేయడం విద్యార్థి దశనుండే అలవర్చుకోవాలని ఈ సహాయనిధిని అందించిన విద్యార్ధినీ, విద్యార్థులందరిని అభినందించారు. చిన్నారి వైద్యఖర్చుల నిమిత్తం ఎవరైనా విరాళాలు పంపించదలచిన ఫోన్ పే నెంబర్ 8008257291 (ప్రవళిక బెల్లపు చిన్నారి ఐశ్వర్య తల్లి).