
పయనించే సూర్యుడు31.7.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టికే గంగాధర్. *పి .డి .ఎస్ .యు .డిమాండ్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్యు ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఎస్టీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని విద్యార్థులు పట్ల ఆమానుషంగ బూతులు తిడుతున్న వాడిని సస్పెండ్ చేయాలని సబ్ కలెక్టర్ ఏవో కి వినతిపత్రం అందించడం జరిగింది…ఈ సందర్భంగా పిడిఎస్యుజిల్లా అధ్యక్షుడు ఎం నరేందర్.. మాట్లాడుతూఆర్మూర్ పట్టణ కేంద్రంలో గల ప్రభుత్వ ఎస్పీ బాలుర వసతి గృహంలో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని వారు అన్నారు వసతిపురం ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నా నేటి వరకు విద్యార్థులకు సకాలంలో పౌష్టికంగా మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని అన్నారు మెనూ ప్రకారం భోజనం వడ్డించాలని వసతి గృహ వార్డెన్ గోదావరి ని విద్యార్థులు అడగగా తనకు ఇష్టం వచ్చిన రీతిలో విద్యార్థులు బూతులు తిడుతూ మీరు హాస్టల్ నుండి వెళ్లిపోవాలని హుకుం జారీ చేస్తుందని అన్నారు..అదేవిధంగా విద్యార్థులు వార్డెన్ దగ్గరికి మెనూ ప్రకారం భోజనం అందించాలని అడిగితే మీరు మహిళ అని చూడకుండా దగ్గరికి వస్తారా అంటూ వారిని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుందని అన్నారు అంతేకాదు వసతి గృహంలో పరిశుభ్రత పాటించడం లేదని మూత్రశాలలు బాత్రూంలను సైతం సరిగ్గా పరిశుభ్రతగా ఉంచకుండా పూర్తిగా గదులలో వాసనతో నిండిపోయిందని అన్నారు..అదేవిధంగా బాలుర వసతి గృహంలో మహిళా వార్డెన్ ను వెంటనే తొలగించాలని విద్యార్థులకు పౌష్టికంగా మెనూ ప్రకారం భోజనం అందించాలని వారి డిమాండ్ చేశారు లేని పక్షంలో పాడెన్ మేడంను తొలగించే వరకు పోరాటం విద్యార్థులతో కలిసి చేస్తామని వారు హెచ్చరించారు ..ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు కార్యదర్శులు డి నిఖిల్ రాజు , ఎస్టి బాయ్స్ కాలేజ్ హాస్టల్ అధ్యక్షుడు పి. రాజేష్ , ప్రధాన కార్యదర్శి ఎస్. మంగల్దీ , ఉపాధ్యక్షుడు బాలాజీ , భార్గవ్ , సహాయ కార్యదర్శి ఆదిత్య , నాయకులు వినోద్ , వచ్చాల , అజయ్ , తదితరులు పాల్గొన్నారు.