
తాండాలలో వెలుగులు నింపిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
మెల్లగూడ గ్రామపంచాయతీలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సొంత నిధులతో రెండు హైమాస్ట్ లైట్ల ఏర్పాటు
( పయనించే సూర్యుడు ఆగస్టు 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ఫరూక్ నగర్ మండల పరిధిలోని మెల్లగూడ గ్రామ పంచాయతీ పరిధిలో గల కొంగగూడ మరియు కలోని తాండాలలో స్థానిక ప్రజల ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు.ప్రభుత్వ నిధుల కోసం వేచి చూడకుండా,తన సొంత నిధులతో రెండు అత్యాధునిక హై మాస్ట్ లైట్లను ఏర్పాటు చేయించారు.తమ సమస్యను విని సొంత ఖర్చులతో లైట్లను ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి మెల్లగూడ గ్రామ పంచాయతీ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా నిన్న బుధవారం రాత్రి ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి గ్రామస్తుల సమక్షంలో హైమాస్ట్ లైట్లను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మంగారవినాయక్,ఉపసర్పంచ్ పాత్లావత్ రాజు,కౌన్సిలర్ రఘునాథ్ యాదవ్,పోమాల్ పల్లి సర్పంచ్ స్వప్న భూపాల్ రెడ్డి,మాజీ సర్పంచులు పాపిరెడ్డి గూడ తాండ్ర విష్ణువర్ధన్ రెడ్డి,వెంకన్నగూడ లక్ష్మణ్ నాయక్,ఇన్ముల్ నార్వ అజయ్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు, మెల్లగూడ వార్డ్ సభ్యులు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.