పయనించే సూర్యుడు మే 5 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
మేకపాటి రాజమోహన్ రెడ్డి ని సత్కరించిన వైఎస్సార్సీపీ రాష్ట్ర మున్సిపల్ విభాగ ప్రధాన కార్యదర్శి అల్లారెడ్డి పెద్దలు, పూజ్యులు నెల్లూరు పార్లమెంట్ మాజీ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మున్సిపల్ విభాగ ప్రధాన కార్యదర్శి నియమితులైన అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి సోమవారం నెల్లూరులోని మేకపాటి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మేకపాటిని రాష్ట్రస్థాయి పదవి లభించడంతో ధన్యవాదాలు తెలుపుతూ శాలువాతో సత్కరించి పూలబొకేను అందచేశారు.ఈ సందర్భంగా అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మున్సిపల్ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని, వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని మాజీ ఎంపీ మేకపాటికి తెలిపారు. వైఎస్సార్సీపీలో రాష్ట్రస్థాయి పదవి లభించడం పట్ల అల్లారెడ్డి ఆనంద్ రెడ్డిని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఆనంద్ రెడ్డి వెంట పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగులపాటి ప్రతాప్ రెడ్డి , నోటి వినయ్ కుమార్ రెడ్డి ఉన్నారు.