పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు29(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి పట్టణంలోని విజన్ విద్యాసంస్థ ల నందు జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మొదట మేజర్ ధ్యాన్ చంద్ గారి పటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా విజన్ కరస్పాండంట్ విశ్వనాధ్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో ముఖ్యమని చదువులో రాణించడంతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని నేడు ప్రభుత్వం ఉన్నత విద్యతోపాటు ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ క్రీడల్లో కల్పించిందని కాబట్టి విద్యార్థిని విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. జాతీయ క్రీడా దినోత్సవం ను మేజర్ ధ్యాన్‌చంద్ గారి జన్మదిన సందర్భంగా జరుపుకుంటామని ఆయన భారతదేశానికి హాకీ క్రీడలో 1928, 1932,1936 సంవత్సరాలలో ఒలంపిక్స్ క్రీడలలో హాకీ క్రీడ నందు అనేక గోల్స్ చేసి బంగారు పథకాలను దేశానికి తెచ్చి పెట్టడం జరిగిందని, ఆయన భారత సైన్యంలో మేజర్ గా పని చేశాడని క్రీడల్లో భారతదేశం యొక్క పేరును ప్రపంచ దేశాలకు తెలియజేశారని కొనియాడారు. అనంతరం క్రీడాకారులను ప్రోత్సహిస్తూ కబడ్డీ క్రీడను విద్యార్థులతో కలిసి విజన్ ఉపాధ్యాయ బృందం ఆడి విద్యార్థులను ఎంతో ఉత్తేజ పరచడం జరిగింది. ఈ సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రసాద్ ను పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో విజన్ ఉపాధ్యాయ బృందం, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు