
మేడారంలో ఎమ్మెల్యే తులాభారం..
భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన వీర్లపల్లి..
ఘన స్వాగతం పలికిన ఆలయ నిర్వహకులు
( పయనించే సూర్యుడు జనవరి 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
మానవ రూపంలో పుట్టి అసమానమైన తమ వీరత్వంతో.. కన్నీరు పెట్టించే తమ కథతో.. వేగాన్ని నింపే త్యాగాలతో దేవతలుగా కొనియాబడిన సమ్మక్క- సారక్క లను దర్శించే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మేడారం జాతరను పురస్కరించుకొని గ్రామదేవతలైన సమ్మక్క- సారక్కల ఆలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వహకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భక్తిశ్రద్ధలతో గ్రామ దేవతలను దర్శించుకుని పూజా కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన అనంతరం అక్కడ సంప్రదాయబద్ధంగా బెల్లంతో చేసే తులాభారంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ తమను నమ్మిన గ్రామ ప్రజలను కాపాడడానికి నారీమణులు అయినప్పటికీ అత్యంత సాహసంగా పోరాటం చేసి ఆనాటి ప్రతాపరుద్రుడిని మెప్పించిన మహనీయులని అన్నారు. అందుకే అక్కడికి గ్రామ ప్రజలు వాళ్లను దేవతలుగా కొలిచి పూజిస్తారని వెల్లడించారు. క్రమంగా ఇక్కడ జాతర జరగడం, దేశవ్యాప్తంగా భక్తజనం ఎక్కడికి తరలి రావడంతో సమ్మక్క సారక్క చరిత్ర ప్రపంచాన్ని తాకిందని ఆయన అన్నారు. ప్రతి యుగంలోనూ మానవాళిని కాపాడేందుకు దేవుడు మనుషుల రూపంలో జన్మిస్తాడని పురాణ ఇతిహాసాల్లో చెబుతున్నారని, అలా బడుగు జీవులను కాపాడేందుకు పుట్టిన దేవతలే సమ్మక్క సారక్క కానీ ఆయన అన్నారు. ఉప సర్పంచ్ లింగారెడ్డిగూడెం అశోక్, మాజీ ఉపసర్పంచ్ సీతారాం, నర్సప్పగూడ కృష్ణ, అల్లుడు నాని, తుపాకుల శేఖర్, కమ్మదనం నవీన్ , అంజి, దర్శన్, రాణా, మహేందర్, తదితరులు ఆయన వెంట ఉన్నారు.
