
నూతన అధ్యక్షుడికి కంచి మహేందర్‌తో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తల శుభాకాంక్షలు
పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 8 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి భారతీయ జనతా పార్టీ మేడ్చల్–మల్కాజ్గిరి అర్బన్ జిల్లా అధ్యక్షుడిగా గిరివర్ధన్ రెడ్డి నియమితులైన సందర్భంగా ఆయన నివాసంలో అభినందన కార్యక్రమం జరిగింది. బీజేపీ సీనియర్ నాయకులు కంచి మహేందర్ ఆధ్వర్యంలో డివిజన్‌కు చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు గిరివర్ధన్ రెడ్డి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన గిరివర్ధన్ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. పార్టీ కండువా కప్పి సత్కరించి, ఆయన నాయకత్వం లో మేడ్చల్–మల్కాజ్గిరి అర్బన్ పరిధిలో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడంలో నూతన అధ్యక్షుడి నాయకత్వం కీలకంగా ఉంటుందని నాయకులు పేర్కొన్నారు. ప్రతి డివిజన్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, ప్రజా సమస్యలను నిరంతరం ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. గిరివర్ధన్ రెడ్డి నాయకత్వంలో పార్టీకి మరింత ఉత్సాహం, కొత్త దిశ లభిస్తుందని బీజేపీ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేశాయి. పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ సంస్థాగతంగా బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కాంచి మహేందర్‌తో పాటు డివిజన్ బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొని నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నాయకులు పరస్పరం చర్చించుకున్నారు.
పార్టీ బలోపేతమే లక్ష్యం నూతన బాధ్యతలు స్వీకరించిన గిరివర్ధన్ రెడ్డికి పార్టీ శ్రేణుల నుంచి వెల్లువెత్తిన అభినందనలు బీజేపీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. మేడ్చల్–మల్కాజ్గిరి అర్బన్ పరిధిలో పార్టీని మరింత బలమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.