పయనించే సూర్యుడు మే 13 నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టి యు సి ఐ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని దేశాయ్ బీడీ కంపెనీలో మే 20న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చెయ్యాలి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టి యు సి ఐ రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తన్న మాట్లాడుతూ మే డే స్పూర్తితో కార్మికులు కొట్లాడి 8 గంటల పని దినాన్ని సాధించుకోవడం జరిగిందని కానీ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో 12 గంటల పని విధానాన్ని అమలు చేయడం సరైంది కాదు అని కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు దేశంలో కార్మికులు సాధించుకున్నటువంటి 44 చట్టాలను మోడీ ప్రభుత్వం 15 చట్టాలను తీసివేసి 26 చట్టాలను నాలుగు కోడ్స్ గా తీసుకువచ్చి కార్మికులను కట్టు బానిసలుగా చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని వారు పిలుపునిచ్చారు అదేవిధంగా కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేయాలని కనీస వేతనం 26000 అమలు చేయాలని కోరారు సంఘటిత అసంఘటిత కార్మికులకు నెలకు కనీస పెన్షన్ 9000 ఇవ్వాలని పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించాలని ఎన్ పి ఎస్ యుపిఎస్ ను రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటికరణ ఆపాలని వారు డిమాండ్ చేశారు ఉపాధి హామీ కూలీలకు 600 కూలి చెల్లించాలని సంవత్సరానికి 200 రోజులు పని కల్పించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో నిమ్మల నిఖిల్ భద్రయ్య రమేష్ నారాయణ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు