పయనించే సూర్యుడు అక్టోబర్ 22,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
మొక్కజొన్న, సొయాబీన్, సజ్జ పంటలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన వైస్సార్సీపీ రైతు విభాగం నాయకులు.
మొక్కజొన్న పంట కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర కన్నా రూ. 600 తక్కువగా ఉన్నందున మొక్కజొన్న పంటను మార్క్ ఫెడ్ కొనుగోలు చేయాలని, మొక్కజొన్న సోయాబీన్ సజ్జ పంటలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని వైస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్ కుమార్ రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి లు అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ రాజకుమారి ని కలిసి వైస్సార్సీపీ రైతు విభాగం నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వంగాల భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో సాగు చేసిన ప్రధాన పంటలు మొక్కజొన్న, సోయాబీన్, సజ్జ పంటలు కనీస మద్దతు ధర (ఎం ఎస్ పి) కంటే తక్కువ ధర వుందన్నారు.రాష్ట్రం మొత్తం లో మొక్క జొన్న 4 లక్షల ఎకరాలు సాగు జరిగితే నంద్యాల జిల్లాలోనే 1.59 లక్షల ఎకరాలు సాగు జరిగిందన్నారు. మొక్కజొన్న పంట గత నెల రోజులుగా కోతలు జరుగుతున్నాయని, పంటకు ధర మాత్రం రూ.1800 మాత్రమే లభిస్తుందన్నారు.2025 - 26 కు కేంద్రం ప్రకటించిన మొక్క జొన్న పంటకు కనీస మద్దతు ధర ప్రకారం 2400 రూపాయలని,కాని క్వింటాల్ కు 600/- రూ ధర
తక్కువగా మార్కెట్ ఉందన్నారు. కావున మొక్క జొన్న పంటను మార్క్ ఫెడ్ కొనుగోలు చేయాలని తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
సోయాబీన్ కూడా కనీస మద్దతు ధర రూ. 5328/- ఉంటే కేవలం రూ.3900/- మాత్రమే మార్కెట్ లో కొనుగోలు జరుగుతుందన్నారు.ఆకాల వర్షాలకు రైతులు పంటలను పొలంలోనే చాల వరకు నష్ట పోయారని వచ్చిన అరకొర పంట కూడా ధర పడిపోతే రైతాంగం చాలా వరకు నష్టపోతారన్నారు.సజ్జ పంట గత 50 రోజుల నుండి మార్కెట్ కు వస్తోందని సజ్జ ఎం ఎస్ పి 2775/- రూ ఉంటే కేవలం రూ.1900 నుండి రూ.2000 కొనుగోలు జరుగుతుందన్నారు. సజ్జ పంట కూడా కనీస మద్దతు ధర కలిపించాలని గతంలో మీ దృష్టికి తీసుకొచ్చామన్నారు.కావున వెంటనే మొక్కజొన్న, సొయాబీన్, సజ్జ పంటలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గాండ్ల శివరాముడు,రూపేంద్ర కుమార్ రెడ్డి,కురువ దస్తగిరి, వెంకట నారాయణ,రంగడు. కురువ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.