పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 19
అల్లూరి సీతారామరాజు జిల్లా ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న మొట్టడం వీరయ్యదొర పార్క్ ని అభివృద్ధి చేయాలని భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మొట్టడం రాజబాబు పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీ పూజని కోరారు.పాడేరు ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న మొట్టడం వీరయ్యదొర పార్క్ ని అభివృద్ధి చేయాలని,అలాగే మన్యం పితూరులో పాలుపంచుకొన్న స్వతంత్ర సమరయోదుల గుర్తుగా ప్రభుత్వ కార్యాలయాలకు వారి పేర్లు పెట్టాలని,గతంలో రోణంకి గోపాలక్రిష్ణ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారిగా ఉన్న సమయంలో ఐటీడీఏలో కొన్ని కార్యాలయాలకు మన్యం పితూరు నాయకులు, స్వతంత్ర సమరయోధులైనా గాం గంఠన్నదొర,గాం మల్లుదొర పేర్లు పెట్టారు,అలాగే ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న పార్క్ కు లాగరాయి పితూరు నాయకుడు,స్వతంత్ర సమరయోదుడైనా మొట్టడం వీరయ్యదొర పార్క్ గా పేరు పెట్టడం జరిగిందని గుర్తు చేసారు.ప్రభుత్వ కార్యాలయాలకు, పార్క్ లకు ఆదివాసి స్వతంత్ర సమరయోధుల పేర్లు పెట్టి వారికి సముచిత గౌరవం ఇవ్వాలని వినతిపత్రంలో కోరారు.ఈ కార్యక్రమంలో భారత్ ఆదివాసీపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కిల్లో ప్రసాద్ రావు పాల్గొన్నారు.