
రుద్రూర్, అక్టోబర్ 27 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):
రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన గోలి సుబ్బా లక్ష్మీ w/o శివ కేశవరావు (శివయ్య) మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న సమయంలో ఈ విషయాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి మాజీ సొసైటీ అధ్యక్షుడు పత్తిరాము తీసుకెళ్లారు. వెంటనే స్పందించి ఆ కుటుంబానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆపద్బాంధవుడిగా నిలిచారు. బాన్సువాడ లో సోమవారం ఆ కుటుంబానికి శాస్త్ర చికిత్స కోసం సీఎం సహాయ నిధి కింద 75 వేల రూపాయలు చెక్కును అందించారు. దింతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.