కాంగ్రెస్ పార్టీలోనే కుల రాజకీయాలు ఎలా నడుస్తున్నాయో అందరికీ తెలుసు.
రేవంత్ రెడ్డి మాటలేమో ఎక్కువ పని మాత్రం సున్నా
బీజేపీ యువ నాయకులు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 16 షాద్‌నగర్ నియోజకవర్గం నరేందర్ నాయక్ : కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి, మోడీ మీద అర్ధంలేని విమర్శలు చేస్తూ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఇప్పుడు మోడీ గారి కులం గురించి మాట్లాడుతున్నారు. కానీ, నిజం ఏంటో మీకు తెలియాలి! మోడీకి కులం లేదు దేశమే కుటుంబం! నరేంద్ర మోడీ తన జీవితాన్ని దేశసేవకే అంకితం చేశారు. కుటుంబం, స్వప్రయోజనాలు, వర్గపోట్లు ఇవేమీ ఆయన పాలిటిక్స్‌లో లేవు. ఆయన ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, కష్టం చేసి, ప్రజల మద్దతుతో ఈ స్థాయికి ఎదిగారు. ఆయన జీవితమే ఓపెన్ బుక్.కులం పేరు చెప్పి పబ్బం గడుపుకోవడం కాంగ్రెస్ స్టైల్! మోడీ ఓబీసీ కులానికి పరిమితం చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కానీ ఆయన ఓ కులానికి చెందిన నేత కాదు.. దేశాన్ని ముందుండి నడిపిస్తున్న మహానేత! దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు మోడీ గారిని మద్దతు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ముందు తన పార్టీ నేతల కులాలను లెక్కపెట్టుకోవాలి!తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోనే కుల రాజకీయాలు ఎలా నడుస్తున్నాయో అందరికీ తెలుసు. ఫ్యాక్షన్లతో, కుల సమీకరణాలతో ఆ పార్టీ ముందుకు వెళ్లడం చూస్తూనే ఉన్నాం. మోడీని విమర్శించే ముందు, రేవంత్ మీ పార్టీ పరిస్థితిని అర్ధం చేసుకోవాలి! మండల్ కమిషన్ దెబ్బకు గాంధీ కుటుంబం ఎందుకింత భయపడింది? మోడీ ఓబీసీ సంక్షేమానికి నిజమైన మార్గదర్శి. అయితే, కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఓబీసీ సంక్షేమానికి కృషి చేసిందా? గాంధీ కుటుంబం మండల్ కమిషన్ దెబ్బకు భయపడి వెనుకడుగు వేసింది. నిజంగా రాహుల్ గాంధీకి ఓబీసీల మీద ప్రేమ ఉంటే, ఈ డెబ్బై ఏండ్లలో వాళ్ల కోసమేంటి చేశాడు? రేవంత్ రెడ్డి - మాటల మాంత్రికుడు, పనిలో సున్నా!విమర్శించడం ఒకటి, కానీ అభివృద్ధికి ఏం చేస్తున్నారు? తెలంగాణ కోసం రేవంత్ ఏమైనా తెచ్చారా? ఎలాంటి ప్రాజెక్టులు, ఎలాంటి కొత్త ఉపాధి అవకాశాలు? ప్రజలు ఇప్పుడు మాటలు కాదు, పని చేయాలని చూస్తున్నారు. కాబట్టి, రేవంత్ , మోడీ మీద మాటలు వేసే ముందు మిమ్మల్ని మీరు చూసుకోండి. మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి బాటలో దూసుకెళ్తోంది. అందుకే ప్రజలు 3 వ సారి మోడీ నే ప్రధాని చేయాలని నిర్ణయించుకున్నారు!