పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 26(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాలలో ఐదవ రోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మోహిని దేవి అలంకారంలో దర్శనమిచ్చారు ఉదయం సుప్రభాత సేవ పంచామృతాభిషేకం నూతన పట్టు వస్త్రాల సమర్పణ పంచహారతులు మహా మంగళహారతి హోమాధి కార్యక్రమాలు సాయంత్రం రథోత్సవం కుంకుమార్చన లలితా సహస్రనామావళి మణిద్వీప వర్ణన తోపాటు చిన్నారులచే కోలాటం భరతనాట్య ప్రదర్శన ఖడ్గమాల కార్యక్రమం మహా మంగళహారతి భక్తి క్విజ్ ప్రోగ్రాం విజేతలకు బహుమతులు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించారు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం అంతా యాడికి ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య మహిళా సంఘం ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు