
ముఖ్యఅతిథిగా పాల్గొన్న పాఠశాల కరస్పాండెంట్ మరియు డాక్టర్ ఎండి వాజిత్ పాషా :
షాద్నగర్ పట్టణంలోని మాగ్నెట్ హై స్కూల్ లొ ఘనంగా డాక్టర్స్ డే నిర్వహించడం జరిగింది. డాక్టర్స్ డే అనేది వైద్యుల యొక్క పాత్ర సొసైటీలో ఎంత ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు తెలియజేయడంతో పాటు ప్రపంచం డాక్టర్స్ యొక్క అవసరాల గురించి విద్యార్థులకు వివరించడం జరిగింది. ఇందులో భాగంగా వివిధ తరగతులకు సంబంధించిన విద్యార్థులు డాక్టర్స్ వేషధారణలో డాక్టర్లుగా తమ తోటి విద్యార్థులకు వైద్య సేవలు నిర్వహించడం జరిగింది. పిల్లల వైద్యముకు సంబంధించి ఆరోగ్య పరిస్థితిలకు సంబంధించి కొన్ని రకాల పరీక్షలు దానితోపాటు కొన్ని రకాల మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల విద్యార్థులలో డాక్టర్ల ప్రాముఖ్యతను తెలియచెప్పకావడానికి ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పాఠశాల కరస్పాండెంట్ ఎండి వాజిద్ పాషా మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరికులం డైరెక్టర్ వినోద్ పాఠశాల ప్రిన్సిపల్ ఆనంద్ కుమార్ వైస్ ప్రిన్సిపల్ ఆసిఫ్ ఉపాధ్యాయ ఉపాధ్యాయ ఇతర బృందం పాల్గొనడం జరిగింది.