రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు గెలుపొందిన జస్వికా రాథోడ్, స్వస్తిక
అభినందించిన స్కూల్ కరస్పాండెంట్ వాజిద్ పాషా
( పయనించే సూర్యుడు అక్టోబర్ 13 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్నగర్ పట్టణంలోని మ్యాగ్నెట్స్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ లో చదువుతున్న విద్యార్థినులు షాద్నగర్ పట్టణంలోని రంగనాయక ఆడిటోరియంలో జరిగిన రాష్ట్రస్థాయి కరాటే పోటీల్లో ఉత్తమ ప్రతిభను కనబరిచారని స్కూల్ కరాటే మాస్టర్ నరేందర్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. కటాస్ విభాగంలో 4వ తరగతి చదువుతున్న జస్విక రాథోడ్ రెండో బహుమతి గెలుపొందగా, ఎనిమిదో తరగతి చదువుతున్న స్వస్తిక మూడో బహుమతిని గెలుపొందారు. గెలుపొందిన విద్యార్థులకు మలేషియా దేశానికి చెందిన సీనియర్ కరాటే మాస్టర్ చేతులమీదుగా బహుమతులను అందుకున్నారు. గెలుపొందిన విద్యార్థులకు మ్యాగ్నెట్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ కరస్పాండెంట్ వాజిద్ పాషా, కరికులం డైరెక్టర్ వినోద్, ప్రిన్సిపాల్ ఆనంద్, వైస్ ప్రిన్సిపాల్ ఆసిఫ్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడానికి తమ సహాయ సహకారాలు అన్నివేళలా ఉంటాయని స్కూల్ కరస్పాండెంట్ వాజిద్ పాషా అన్నారు.