
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
రాష్ట్ర సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ( జేఏసీ) పిలుపు మేరకు ఆందోళనా కార్యక్రమాలు భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన బ్రాంచ్ వద్ద జిల్లా అధ్యక్షుడు యర్రంశెట్టి రామచంద్రరావు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. మన న్యాయమైన డిమాండ్స్ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాల కి పెంచాలి. జీవో నెంబర్.36 వెంటనే అమలు చేయాలి. 2019 తరువాత నియమించిన సిబ్బందిను పర్మినెంట్ చేయాలి.2019.2024 వేతన సవరణ అమలు చేయాలి. గ్రాట్యుటీ చట్టప్రకారం అమలు చేయాలి.లాభనష్టాలతో సంబంధం లేకుండా జీతాలు చెల్లించాలి.సభ్యులకు రావాల్సిన వడ్డీ రాయితీలు వెంటనే చెల్లించాలి.తదితర అంశాలపై దశల వారీగా ఆందోళనా కార్యక్రమాలు చేస్తున్నాం. అయినా ప్రభుత్వం నుండి కానీ, అప్కాబ్ వారినుండి కానీ స్పందన రానందున ఆందోళన ఉదృతం చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఉద్యోగులు అప్పారి సత్య ప్రేమేశ్వరరావు, కోటిపల్లి శ్రీ రామ వర ప్రసాద్, కోటిపల్లి సీతారామారావు, గుత్తుల వెంకట శ్రీనివాస్, విత్తనాల శంకర్, గుబ్బల నాగేంద్ర కుమార్, యర్రంశెట్టి నాని, మల్లాడి కృష్ణ మూర్తి, గొల్లపల్లి శ్రీను,సత్తిబాబు,నాగభూషణం, వెంకటేష్, కిరణ్ శరత్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు
