పయనించేసూర్యుడు.
న్యూస్.11.జనవరి.
పుల్కల్ ప్రతినిది. పెద్దగొల్లవిజయ్ కుమార్.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలపరిదిలోని
సింగూర్ నందు టి.ఈ.ఈ.1104 యూనియన్ 2025 నూతన డైరీ మరియు క్యాలెండర్ ల పంపిణీ కార్యక్రమం రీజినల్ అధ్యక్షులు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కె.చంద్రయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యూనియన్ జెన్కో రాష్ట్ర కార్యదర్శి వి.దుర్గా అశోక్ ,ఎ.డి.ఈ. లు సౌజన్య, రాధిక. నాగేంద్రస్వామి. పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎ.డిఈ. లు మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం సాంప్రదాయ బద్ధంగా డైరీ మరియు. క్యాలెండర్లు ఆవిష్కరణలు చేసుకోవడం, ఈ సందర్భంగా కార్మిక సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా ప్రయత్నాలు చేయడం 1104 సంఘ గొప్పదనమని, అనంతరం డైరీ & క్యాలెండర్లను సభ్యులకు అధికారులకు పంపిణీ చేయడం కూడా చక్కటి సాంప్రదాయమని కొనియాడారు.
ఈ కార్యక్రమానికి ఇంజనీర్లు, తెలుగు శ్రీనివాస్, గుత్తా సురేష్ బి ఆర్ బి.ఆనంద్, వంశి, రాజు ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జెన్కో ఉపాధ్యక్షులు జహంగీర్ రీజినల్ నాయకులు చంద్రశేఖర్, హుస్సేన్ ఖాన్ .సీనియర్ నాయకులు అశోక్ గౌడ్, డివిజన్ నాయకులు ఆంజనేయులు, సుగుణాకర్, మల్లేష్, అనంత రాములు, లక్ష్మణ్, శివయ్య, లక్ష్మమ్మ, రాజమణి, దస్తగిరి .సెక్యూరిటీ సిబ్బంది కిషోర్. తదితరులు మరియు కాంట్రాక్ట్ కార్మికులు.ఈశ్వర్, సుజాత, జయమ్మ, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.