పయనించే సూర్యుడు న్యూస్.1.పిబ్రవరి. పుల్కల్ మండలప్రతినిది. పెద్దగొల్లవిజయ్ కుమార్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలొని సింగూర్ ప్రాజేక్ట్ టీజీ జెన్కో పరిధిలోఆర్.టి.యస్. ధర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వానికి మరియు జెన్కో యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ.ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొనియస్.ఎచ్.ఈ.యస్. సింగూర్ పవర్ ప్లాంట్ ఆవరణలో 1104 యూనియన్ ఆధ్వర్యంలో* టి.జి.పి.ఈ.జె.ఎ.సి. లోని సంఘాలను మరియు అసోసియేషన్ లను కలుపుకొని సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 1104 యూనియన్ జెన్కో రాష్ట్ర కార్యదర్శి, యం.ఎచ్.యస్.జాక్ చైర్మన్ దుర్గా అశో క్ వాతాడి మరియు టి.జి.ఎ.పి ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరియు యం.ఎచ్.యస్. జాక్ కన్వీనర్ కుర్మి పాండయ్య సంయుక్తంగా కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా అశోక్ వాతాడి మరియు. పాండయ్య లు మాట్లాడుతూ" జన్కో పరిధిలో నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షించదగిన పరిణామం అని ఆనందం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్న విద్యుత్ శాఖ మాత్యులు, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు. ఎనర్జీ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాకు మరియు ఇతర జన్కో ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం రావడానికి విశేషంగా కృషి చేసినటి.జి.పి.ఈ.జె.ఎసి. నాయకత్వానికి, ఈ సందర్భంగా జరిగిన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన టి.జి.పి.ఈ.జె.ఎ.సి. చైర్మన్ సాయిబాబుకు. మరియు కన్వీనర్ రత్నాకర్ రావుకు మరియు జాక్ నాయకులు ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి రంగాన్ని, పంపిణీ మరియు సరఫరా రంగాలను కాపాడుకునేందుకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, ఐక్య ఉద్యమాలు విజయాలు సాధిస్తాయి అనటానికి ఇది నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో 1104 యూనియన్ మరాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మరియు యం.ఎచ్.యస్. రీజినల్ అధ్యక్షులు కే.చంద్రయ్య, ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు నాగరాజు, తెలుగు శ్రీనివాస్ నాగేందర్, భరత్, ఆనంద్, సురేష్. తదితరులతో పాటు 1104 సీనియర్ నాయకులు అశోక్ గౌడ్, రీజినల్ నాయకులు చంద్రశేఖర్, హుస్సేన్ ఖాన్, డివిజన్ సెక్రెటరీ ఎండి. ఇక్బాల్, డివిజన్ నాయకులు అనంతరాములు లక్ష్మణ్, ఆంజనేయులు, రాజమణి లక్ష్మమ్మ, శివయ్య, దస్తగిరి, కాంట్రాక్ట్ కార్మికులు, హయ్యర్ వెహికల్ డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.