పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 3(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
మండల కేంద్రమైన యాడికి లోని గాంధీ విగ్రహం దగ్గర జిఎస్టి గురించి సేల్ టాక్స్ ఆఫీసర్లు ప్రజలకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు నాలుగు స్లాబులను రెండు స్లాబులుగా మార్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దాదాపుగా 7000 కోట్లు ఆదా అవుతుందని ఈ కార్యక్రమం కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకు మేలు జరిగిందని తెలియజేశారు మెయిన్ రోడ్ లో అందరికీ అవగాహన కావాలని మానవహారంగా ఏర్పడి అందరికీ తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి శశికళ, అధికారులు, మాజీ ఎంపిటిసి దడియాల ఆది, తాండ్ర విక్రమ్, మహమ్మద్ రఫీ, ఆదిత్య పవన్, తదితరులు పాల్గొన్నారు.