పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 1 6(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
మండల కేంద్రమైన యాడికి నందు కొనరొడ్డు వద్దనున్న దస్తగిరి స్వామి కట్ట వద్ధ గురు వారం గ్యార్మీ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ పెద్దలు మరియు భక్తులు ఉదయం దస్తగిరి స్వాముల వారి కట్ట వద్దకు చేరుకొని స్వామివారి పూల శేరా మరియు జెండాలను మేళ తాళాలతో ఘనంగా ఊరేగింపు నిర్వహించారు. చదివింపుల తరువాత స్వామివారి పవిత్ర మలీదా ప్రసాదమును పంచిపెట్టారు.. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.. కుల మత భేదాలకు అతీతంగా దస్తగిరి స్వాములవారి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదములు స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు..