
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 31 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
స్థానిక యాడికి పట్టణంలో విజన్ విద్యాసంస్థల విద్యార్థులు యాడికి సిఐ ఆర్ శ్రీనివాసులు గారితో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో విజన్ విద్యార్థులు ఆర్ శ్రీనివాసులు గారిని ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి, విద్యార్థులు తమరి స్థాయికి రావాలంటే ఏం చేయాలి, ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఏ కార్యక్రమాలు నిర్వహిస్తారు, దొంగలను ఎలా పట్టుకుంటారు, విద్యార్థులు జీవితంలో ఎలా ఉండాలి అనే ప్రశ్నలకు సీఐ శ్రీనివాసులు గారు ఎంతో ఓపికగా చాలా చక్కగా వారికి సమాధానం చెప్పడం జరిగింది. విద్యార్థి దశ నుంచి ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలని ప్రతి ఒక్కరు క్రమశిక్షణను కలిగి ఉండాలని ఎటువంటి చెడు అలవాట్లకు లోను కాకూడదని ఒక ప్రణాళిక బద్ధంగా జీవితాన్ని మలుచుకోవాలని తల్లిదండ్రులకు ఎలాంటి చెడ్డ పేరు తీసుకురాకూడదని జీవితంలో కష్టపడి మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆయన చాలా చక్కగా విద్యార్థులకు వివరించడం జరిగింది. అలాగే కేసు ఫైల్స్ గురించి చట్టాల గురించి కూడా విద్యార్థులకు వివరించడం జరిగింది . ఈ సందర్భంగా విజన్ కరస్పాండెంట్ విశ్వనాథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారికి మీరు తమ విలువైన సమయాన్ని వెచ్చించి విద్యార్థులకు ఇంత చక్కగా వివరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని చెప్పడం జరిగింది…

