
పయనించే సూర్యుడు న్యూస్ :ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఓ యువతి దారుణ హత్య గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సహారన్పూర్కు చెందిన టాక్సీ డ్రైవర్ తన ప్రియురాలని హత్య చేశాడు. ఈ ఘటన యూపీలో కలకలం రేపింది. తన ప్రియురాలి తల నరికి మృతదేహాన్ని హర్యానాలోని కలేసర్ జాతీయ ఉద్యానవనం సమీపంలో విసిరేశాడు. బాధిత యువతి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.సహారన్పూర్కు చెందిన టాక్సీ డ్రైవర్ బిలాల్ అనే వ్యక్తి ఉమా(30) అనే మహిళను ప్రేమించాడు. ఉమాకు 15ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. కుటుంబ కలహాల కారణంగా ఉమా తన భర్తతో రెండేళ్ల క్రితం విడాకులు తీసుకుంది. కుమారుడితో ఆమె వేరొక చోట నివాసం ఉంటుంది. ఈ క్రమంలో బిలాల్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితిసింది. ఒక సంవత్సరం క్రీతం నుంచి ఉమాతో బిలాల్ సహజీవం సాగిస్తున్నాడు. బిలాల్‌కు పెళ్లి కాకపోవడంతో కుటుంబసభ్యులు పెళ్లి సంబంధం చూశారు. దీంతో మరో యువతిని వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. దీంతో ఉమాతో సంబంధాన్ని తెంచుకోవాలని బిలాల్ నిర్ణించుకున్నాడు. బిలాల్‌కు పెళ్లి సంబంధం కుడరడంతో ఉమాను హత్య చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. డిసెంబర్ 6న సాయంత్రం బయటకు వెళ్దామని ఉమాకు చెప్పడం బలుదేరింది. బిలాల్, ఉమాను కారులో ఎక్కించుకుని సుమారు 6 గంటలు పారు తిరిగారు. అనంతరం ఆమెను లాల్ థాంగ్ లోయ సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి తల నరికి చంపాడు. నరికిన తలను మృతదేహాన్ని అడవిలోకి విసిరేశాడు. ఇంటికి తిరిగి వచ్చాడు. బిలాల్ ఏమీ జరగనట్టుగా ప్రవర్తిస్తూ మరో మహిళతో తనకు కాబోయే పెళ్లి కోసం షాపింగ్ మాల్‌కు వెళ్లి దుస్తులు కొనడం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో ఉమా కనబడటం లేదని ఆమె కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.పోలీసుల దర్యాప్తులో ఉమ మృతదేహం లభించింది. పోలీసులు తమదైన శైలీలో విచారణ చేపట్టి బిలాలే ప్రియురాలిని హత్య చేసినట్లు కనిపెట్టారు. వెంటనే బిలాల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది. పోలీసుల విచారణలో బిలాల్ నేరం చేసినట్లు అంగీకరించాడు. ఉమా సోదరుడు తన శోదరి తల నరికివేసినట్లు తెలియడంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.