
పయనించే సూర్యుడు ఆగస్టు 10మక్తల్ ఆర్ఎస్ఎస్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా 12-08-2026 బుధవారం ఉదయం 10 గంటలకు మక్తల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో యువ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని యువ సమ్మేళన సమితి అధ్యక్షులు వన్నవాడ శ్రీకాంత్ తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా శ్రీ రాక సుధాకర్ గారు హాజరు కానున్నారని తెలిపారు. కావున యువత అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో భాగంగా సంఘ్ పరివార్ నాయకులు వివిధ ప్రాంతాల యువతతో సమావేశాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ పీకే నరసింహ, మహేష్ సాగర్, కురవలింగం, నరేందర్, బ్యాటరీ రాజు, మంజునాథ్, రాజా గౌడ్, అంజన్ ప్రసాద్, కల్లూరి అంజి, నాగరాజ్, కోల్పూరాము మేస్త్రి, రాహుల్, నరేష్ పాల్గొన్నారు.