టోర్నమెంట్ బ్రోచర్లు ను ఆవిష్కరించిన యూనిక్ స్కూల్ ప్రిన్సిపల్ నరేందర్
( పయనించే సూర్యుడు ఆగస్టు 26 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ : సెప్టెంబర్ 14 వ తేదీన మాస్టర్ బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించనున్న డిస్టిక్ లెవెల్ కుంగ్ ఫు కరాటే టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా షాద్ నగర్ యూనిక్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ నరేందర్ వారి చేతుల మీదుగా టోర్నమెంట్ బ్రోచర్ని ఆవిష్కరించారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఈ యొక్క టోర్నమెంట్ మన స్కూల్ తరపున విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని స్కూల్ యొక్క పేరు ప్రతిష్టలు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. బాలరాజ్ మాస్టర్ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ ఈ కుంగ్ ఫు కరాటే పోటీలలో పాల్గొని అద్భుత ప్రతిభను కనబరచాలని, పోటీలకు సిద్ధం కావాలని, ఆత్మస్థైర్యం, శారీరక పట్టుత్వం, మానసిక ప్రశాంతతకు ఈ విద్యలు నేర్చుకోవడం విద్యార్థులకు అత్యంత అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యూ పవర్ కుంగ్ ఫు మాస్టర్ నంది అవార్డు గ్రహీత అహ్మద్ ఖాన్ ( బ్రూస్ లీ ),కుంగ్ ఫు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.