
పయనించే సూర్యుడు న్యూస్.సెప్టెంబర్14,నల్గొండ జిల్లా వేములపల్లి మండల రిపోర్టర్.
నల్గొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలో గల ఆమనగల్లు లక్ష్మీ దేవి గూడెం అన్నదాతల మొహంలో చిరునవ్వు.గత కొద్ది రోజుల నుండి రైతులు యూరియా కోసం అరిగోస పడుతున్నారు.సహకార సంఘాలు పెస్టిసైడ్స్ షాపుల ముందు రైతులు బారులు దిగుతున్నారు.వరి పంట పొలాలకు యూరియా లేక రైతులు ఇక్కట్లు పడి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుండడంతో ఆమనగల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతుండడంతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి ఆమనగల్లు, లక్ష్మీదేవిగూడెం గ్రామాలకు ఒక లారీ యూరియా తెప్పించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే మనసున్న మారాజు అని ఈ సందర్భంగా రైతులు అభిప్రాయపడుతున్నారు.