దౌల్తాబాద్, ఆగస్టు 26 (సూర్యుడు,):
టోకెన్లు ఉన్న రైతులకు యూరియా ఇవ్వకుండా అక్రమంగా అడ్డదారిలో ఇతర గ్రామాల్లో గుర్తుచప్పుడు కాకుండా యూరియా అమ్మిన దౌల్తాబాద్ జ్యోతి పట్ల యజమాని గోపిశెట్టి శ్రీనివాస్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని లైసెన్సులు రద్దు చేయాలని ఆయా గ్రామాలకు చెందిన బాధిత రైతులు జ్యోతి ఫర్టిలైజర్ దుకాణం ముందు ధర్నా నిర్వహించారు. దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన గోపిశెట్టి శ్రీనివాస్ జ్యోతి ఫర్టిలైజర్ యజమాని మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు యూరియా కోసం టోకెన్లు ఇచ్చారు. జ్యోతి ఫర్టిలైజర్ యజమాని గోపిశెట్టి శ్రీనివాస్ కొంతమంది టోకెన్లు ఉన్న రైతుల వద్ద డబ్బులు తీసుకొని టోకెన్లు డబ్బులు తీసుకున్న రైతులకు కాకుండా మండల పరిధిలోని నర్సంపేట గ్రామం లో రెండు లారీల యూరియాను అక్రమంగా డంపింగ్ చేసి గుట్టు చప్పుడు కాకుండా సోమవారం రాత్రి బస్తాకు రూ. 350 వెచ్చించి రైతులకు అమ్మేశాడు. మంగళవారం విషయం తెలుసుకున్న ఆయా గ్రామాలకు చెందిన బాధిత రైతులు మండల కేంద్రంలోని శివాజీ చౌరస్తాలో జ్యోతి ఫర్టిలైజర్ యజమాని గోపిశెట్టి శ్రీనివాస్, మండల వ్యవసాయ శాఖ అధికారి సాయికిరణ్, డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం జ్యోతి ఫర్టిలైజర్ యజమాని గోపిశెట్టి శ్రీనివాస్ షాపును సీజ్ చేయాలని అతనిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించారు. సుమారు రెండు గంటలకు పైగా రైతులు ధర్నా నిర్వహించడంతో ఎక్కడి వాహనాలు అక్కడ ఆగి పోయాయి. రైతుల ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న గజ్వేల్ ఏసిపి నరసింహులు , దుబ్బాక ఏ డి ఏ మల్లయ్య,తొగుట సిఐ లతీఫ్ లు, ఎస్సై అరుణ్ కుమార్ సిబ్బంది, జ్యోతి ఫర్టిలైజర్ దుకాణం ముందు రైతులు ధర్నా చేస్తున్న స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. జ్యోతి ఫర్టిలైజర్ గోపిశెట్టి శ్రీనివాస్ పై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని టోకెన్లు ఉన్న రైతులకు యూరియా అందించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. కాగా గోపిశెట్టి శ్రీనివాస్ జ్యోతి ఫర్టిలైజర్ దుకాణాన్ని, రోహిణి ఫర్టిలైజర్ దుకాణాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలా అక్రమంగా యూరియా అమ్ముతున్నారన్నారు. అక్రమంగా యూరియా అమ్ముతున్న రైతులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు పునరుత్వమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకొని సంబంధిత ఫర్టిలైజర్ దుకాణ యజమానుల లైసెన్సులు రద్దు చేయాలని పలు గ్రామాల రైతులు మండిపడుతున్నారు.టోకెన్ ప్రకారం నీకు యూరియా ఇస్తానని, డబ్బులు తీసుకొని యూరియా ఇవ్వలేదు.నా పేరు మారుపాక సత్తయ్య గ్రామం గాజులపల్లి నాకు వ్యవసాయ శాఖ అధికారులు క్యూ లైన్ లో నిలబడితే టోకెన్ ఇచ్చారు.టోకెన్ ప్రకారం మీకు యూరియా ఇస్తానని డబ్బులు తీసుకొని నాకు యూరియా ఇవ్వకుండా నర్సంపేట గ్రామంలో సోమవారం రాత్రి అక్రమంగా యూరియా అమ్మడం జరిగింది. ఇలా చాలామంది రైతుల వద్ద జ్యోతి ఫర్టిలైజర్ యజమాని గోపిశెట్టి శ్రీనివాస్ ఇలా చాలామంది రైతుల వద్ద డబ్బులు తీసుకున్నాడు. వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల అక్రమంగా అడ్డదారిలో ఇలా యూరియా అమ్మడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.