పయనించే సూర్యుడు సెప్టెంబర్ 23 (ఆత్మకూరు నియోజకవర్గ ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం నాగులావెల్లటూరు, ఏటూరు గ్రామం లో అధిక యూరియా వాడకం వలన కలుగు పరిణామాలపై అవగాహన సదస్సు. ఈ సదస్సులో మండల వ్యవసాయ అధికారి హిమ బిందు మాట్లాడుతు అధికంగా యూరియా వినియోగం వలన నేలలో ఆమ్లతత్వం పెరిగి పోషకాలు అందుబాటులో లేకుండా ఉంటాయి. నీటి మరియు నేల కాలుష్యం అధికమవుతుంది. పైరు ఎపుగా పెరిగి చీడపీడలు ఎక్కువగా ఆశిస్తాయని తద్వారా పురుగుమందులు తెగులు మందులు అధికంగా వాడవలసి వస్తుందని తెలియజేశారు. అంతే కాకుండా వేసిన పంట పరిశీలించి అనంతరం రైతులతో మాట్లాడుతూ భూమి లేని కౌలు రైతులు సిసిఎస్ కార్డు పొందడం వలన ప్రభుత్వం పథకాలు రాయితీని పొందవచ్చు అని తెలిపారు. అందువలన కౌలు రైతులు తప్పనిసరిగా సిసిఆర్ కార్డు పొందాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమం లో వి ఏ ఏ. జి . శ్రీను, ఇమ్రాన్ ఖాన్ రైతులు పాల్గొన్నారు