
పయనించే సూర్యుడు అక్టోబర్ 27 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలలో విజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కు చెందిన విద్యార్థులు అత్యున్నత ప్రతిభను కనబరిచి డివిజన్ స్థాయి గేమ్స్ కు ఎన్నిక కావడం జరిగింది . ఇందులో అండర్- 17 కబడ్డీ కి చరణ్, గోవర్ధన్, అమృత్, మధు, మనీ శ్రీరంగ ఎన్నికవ్వగా అండర్- 17 యోగా నందు వెంకట్, ఇస్మాయిల్ ఎన్నికవ్వగా,అండర్- 17 కోకో నందు రవితేజ విన్సెంట్ ఎన్నికవగా,అండర్- 17 రన్నింగ్ నందు భైరవ మనోజ్, జ్ఞాన చరణ్ అండర్ -17 షటిల్ నందు ఫహుదల్లా,జమీల్ ఖదీర్ ఎన్నిక కావడం జరిగింది.. అలాగే అండర్ - 14 కబడ్డీ నందు విజయ్, ఇర్ఫాన్, గణేష్,మౌర్య, రవి ఎన్నికవ్వగా అండర్ -14 సెటిల్ నందు శ్రవణ్,ధనుష్ ఎన్నికవ్వగా అండర్ -14 యోగా నందు శ్రీకర్ ఎన్నికవ్వడం జరిగింది.. విజన్ ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు
