
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 8 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : రంగారెడ్డి జిల్లా (అర్బన్) భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నియమితులైన సందర్భంగా గోపాల్ రావు ఈరోజు రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు గోపాల్ రావును శాలువాతో ఘనంగా సన్మానిం చి, నూతన బాధ్యతలు విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అహర్నిశలు శ్రమించే కార్యకర్తలను భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ గుర్తించి, వారికి తగిన గౌరవం మరియు బాధ్యతలను అప్పగిస్తుందని పేర్కొన్నారు.అలాగే, గోపాల్ రావు పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేసి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని గోపాల్ రావుకు అభినందనలు తెలిపారు.