పయనించే సూర్యుడు న్యూస్ జూలై 9 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి
శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ చెందిన పి. రాందాస్ గౌడ్ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.
తనపై నమ్మకంతో రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాందాస్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్న నాకు టీపీసీసీ గుర్తించి ఈ పదవి ఇవ్వడం సంతోసంగా ఉందన్నారు. పార్టీ బలోపేతానికి ఎల్ల వేళలా కృషి చేస్తానన్నారు. నాకు ఈ పదవి రావటానికి కృషిచేసిన పిసీసీ అధ్యక్షులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియాజేశారు.