

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ కార్యక్రమం రాష్ట్ర డైరెక్టర్ సలీం….పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లాలోని సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ప్రాంతీయ కార్యాలయంలో రాష్ట్ర డైరెక్టర్ సలీం కేక్ కట్ చేసి, ఒకరినొకరు స్వీట్లు తినిపించుకొని అలైబలై చేసుకున్నారు. ఈ సందర్భంగా సహచట పరిరక్షణ కమిటీ ప్రతినిధులు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి పండుగ సంతోషాన్ని పంచుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పండుగలు మనుషుల మధ్య సోదర భావాన్ని మరియు ఐక్యతను పెంపొందిస్తాయని రాష్ట్ర డైరెక్టర్ తెలిపారు. ప్రజా సంక్షేమo కోసం ఇలాగే కలిసికట్టుగా పనిచేస్తూ హిందూ ముస్లిం అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరు ప్రతి పండుగను కలిసిమెలిసి నిర్వహించు కోవాలని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ ఎం ఏ సలీం, జిల్లా సలహాదారులు డాక్టర్ హరీష్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఏ ఎం బి భాస్కర్, జిల్లా పట్టణ ఉపాధ్యక్షులు సల్ల కృష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శి రామచందర్ తదితరులు పాల్గొన్నారు.