
పయనించే సూర్యుడు డిసెంబర్ 24 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట చుట్టుపక్కల గ్రామాల్లో ఇదండీ సంగతి బెల్ట్ షాపులకు బలి అవుతున్న గ్రామాలు….*బెల్ట్ షాపులవల్ల గ్రామాల్లో చితికి పోతున్న పేదల జీవితాలు కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ తెలిపారు *గ్రామలలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే …..మద్యం విక్రయంలో అభివృద్ధి కనపరుస్తున్న గ్రామాల బిల్డ్ షాపుల నిర్వహణ యజమానులు రండి బాబు…. రండి…. మంచి అవకాశం….. మించిన దొరకదు 365 రోజులు 24×7 వాడ… వాడలా … వీధి… వీధినా…మద్యం అమ్మబడును….. సూళ్లూరుపేట ఎక్సేంజ్ అధికారులు ఎటు పోయారు…..? అసలు సూళ్లూరుపేట లో ఎక్చేంజ్ శాఖ ఉన్నట్టా లేనట్టా మద్యం దుకాణం యజమానుల దగ్గర నుంచి ముడుపులు మూట అందిందా….తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం మండలంలోని, పంచాయతీలో ప్రజల ఆందోళన మూడు మండలాల పంచాయతీ పరిధిలోని చుట్టుపక్కల గ్రామాల్లో బెల్ట్ మద్యం దుకాణాలు విచ్చలవిడిగాపెరిగిపోతున్నాయి గ్రామంలోని ప్రధాన వీధులు, మరియు రోడ్డు పక్కన మద్యం దుకాణాలు గ్రామాల్లో, అక్రమంగా మద్యంవిక్రయాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ ఆరోపిస్తున్నారు……
*బెల్ట్ షాపుల కారణంగా గ్రామాల్లో మధ్య తరగతి పేదలు,యువత మద్యం అలవాటుకు బానిసలవుతూ కుటుంబాల్లో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు పెరుగుతున్నాయని తెలియజేశారు అక్రమ మద్యం విక్రయాలపై ఎక్సైజ్ శాఖ, పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి…బెల్ట్… షాపులను మూసివేయాలని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ పత్రిక ముఖంగా డిమాండ్ చేశారు
