ఈ నెల 31వ తేదీన పరగసాని పాడు,డి.రావి లంక,బోడి గూడెం కమ్యూనిటీ హాల్ నందు జరిగే సమావేశానికి తరలిరండి.
రంపచోడవరం జిల్లా సాధన కమిటీ.ఏపీ ఆదివాసీ జేఏసీ.
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ దేవీపట్నం, ఆగస్టు 28.
రంపచోడవరం కేంద్రంగా కారం తమన్న దొర పేరుతో జిల్లా ప్రకటించాలని రంపచోడవరం జిల్లా సాధన కమిటీ సమావేశం ఈనెల 31వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీపట్నం మండలంలోని పరగసాని పాడు,బోడి గూడెం,డి.రావి లంక ఆర్అండ్ఆర్ కాలనీలలో ఉన్న కమ్యూనిటీ హాల్ నందు రంపచోడవరం జిల్లా సాధన కమిటీ,ఏపీ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమానికి ఆదివాసి మేధావులైన ప్రజాప్రతినిధులు,పెసా గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు,కార్యదర్శులు,ఉపాధ్యాయులు,ఉద్యోగులు,మహిళలు, యువతీ యువకులు మొదలైనవారు కుల,మత,వర్గ భేదం లేకుండా పాల్గొని జయప్రదం చేయాలని దేవీ పట్నం మండలం ప్రజలందరికీ విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీ ఆదివాసీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి కారం రామన్న దొర,మండల కార్యదర్శి యలగాడ నాగేశ్వరావు,బిజెపి మండల నాయకులు కుండ్ల సాయిరామ్ రెడ్డి మొదలైన వారు పాల్గొన్నారు.