పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగష్టు 14
రంపచోడవరం నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే కొనసాగించాలని రాజమండ్రి జిల్లాలో కలిపితే ఊరుకునేది లేదని ఆదివాసి సంక్షేమ పరిషత్ రంపచోడవరం డివిజన్ అధ్యక్షులు మోడిద నూకరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గురువారం నాడు రంపచోడవరంలో కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా నీ విభజించడం సరికాదని అలాగే ఆదివాసులు రాజమండ్రి జిల్లాలో కలవడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని రంపచోడవరం నియోజకవర్గం అల్లూరు జిల్లాలోనే ఉండేటట్లు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గిరిజనేతరులకు అనుకూలంగా రంపచోడవరం నియోజకవర్గం రాజమండ్రిలో కలపాలనే కుట్రను యావత్ ఆదివాసి ప్రజానీకం వ్యతిరేకిస్తుందని దీనిపై రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాల పునర్విభజన లో భాగంగా ఆదివాసీలు తమకు అన్యాయం జరుగుతుందని ఒకపక్క ఆవేదన వ్యక్తపరుస్తుంటే స్థానిక ఆదివాసి ప్రజాప్రతినిధులు మాత్రం తమకేమీ పట్టనట్లు ఉండటం సరికాదని ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే ఈ విషయంలో ప్రభుత్వంతో చర్చించి రాజమండ్రిలో కలపకుండా ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు.ఇప్పటికే ఆదివాసులకు ఎంతో అన్యాయం జరుగుతుందని ఏజెన్సీ ప్రాంతాల్లో నాన్ ట్రైబల్స్ హంగామా నడుస్తుందని కూటమి ప్రభుత్వం ఒకపక్క ఆదివాసులకు న్యాయం చేస్తాం అంటూనే మరోపక్క ఆదివాసి ప్రాంతాన్ని మైదాన ప్రాంతాలు కలపాలని కుట్రలు చేస్తుందని అంతేకాక ఏజెన్సీ ప్రాంతాల్లోని రాజకీయ పార్టీ పదవులను బయట ప్రాంతాల నుంచి వలసలు వచ్చిన నాన్ ట్రైబల్స్ కు అప్పచెప్పుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ఏజెన్సీలో రాజకీయ పార్టీ పదవులకు ఆదివాసులు అర్హులు కారా? అని ఆయన ప్రశ్నించారు. జరుగుతున్నాయి ఈ ఆదివాసి వ్యతిరేక విధానాల ను ఇప్పటికైనా ఆదివాసులు పసిగట్టాలని రాజకీయ పార్టీలు ఆదివాసులను కేవలం జెండాలు మోయటానికి మాత్రమే ఉపయోగించుకుంటారని అర్థం చేసుకోవాలని ఆయన తెలియజేశారు. జిల్లా పునర్విభజనలో భాగంగా రంపచోడవరం నియోజకవర్గానికి జరుగుతున్న అన్యాయంపై ఆదివాసి సంక్షేమ పరిషత్ చేస్తున్న పోరాటంలో ఆదివాసులు భాగస్వామ్యం కావాలని దశలవారు ఉద్యమానికి ఆదివాసులు సిద్ధం అవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ డివిజన్ కోఆర్డినేటర్ పీఠా ప్రసాద్, కడబాల కాసులమ్మ,, విశ్వమ్మ, ఆదమ్మ తదితరులు పాల్గొన్నారు