
పయనించే సూర్యుడు డిసెంబర్ 18,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
బనగానపల్లె పట్టణానికి చెందిన ఫ్రెండ్ బ్లడ్ గ్రూప్ ప్రతినిధి షాషావలి కు మరియు సభ్యులు రామకృష్ణ,మస్తాన్,మణి,వెంకట్ లకు ఉత్తమ ప్రతిభ అవార్డు అందుకున్నారు.గురువారం బేతంచెర్ల పట్టణంలోని అమ్మవారి శాలనందు లైఫ్ యువ నేత్ర సేవా సమితి 9వ వార్షికోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పర్యావరణ పరిరక్షకుడు స్పెషల్ పోలీస్ ఆఫ్ కర్నూలు డిఎస్పి మహబూబ్ బాషా,డోన్ డిఎస్పి శ్రీనివాసులు పాల్గొన్నారు.లైఫ్ యువ నేత్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ప్రతినిధి షాషావలికి ఉత్తమ ప్రతినిధి ప్రశంసపత్రాన్ని డీఎస్పీలు మహబూబ్ బాషా,శ్రీనివాసులు మెమెంటో అందజేసి ఘనంగా సన్మానించారు.బాధితులకు ఏ సమయంలోనైనా రక్తం కావాలని ఫోన్ చేస్తే వెంటనే స్పందించి రక్తాన్ని అందించే ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ సంస్థను గుర్తించి అవార్డును ప్రశంస పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా షాషావలి మాట్లాడుతూ అవార్డు రావడం ద్వారా బాధ్యత మరింత పెరిగిందన్నారు.తనకు సహకరిస్తున్న తన మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని,యువత బాధ్యతగా ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే దేశంలో రక్త కొరత ఉండదని అన్నారు.తాను ఇప్పటికీ 25 సార్లు రక్తదానం చేశానని తెలిపారు.వేల మందికి ప్రత్యక్షంగా,పరోక్షంగా రక్తం అందించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో భారీగా స్వచ్ఛంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు.