
ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
వరల్డ్ ల్యాబ్ టెక్నీషియన్స్ డే సందర్భంగా రక్తదాన శిబిరం
రక్తదాన శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
పాల్గొన్న అందె బాబయ్య,Acp లక్ష్మీనారాయణ,తదితరులు
రక్తదానము ప్రాణదానంతో సమానమని ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు.తెలంగాణ డైగ్నోస్టిక్ వరల్డ్ ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా షాద్నగర్ పట్టణంలోని బుగ్గారెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాని సందర్శించారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు ఈ శిబిరంలో పాల్గొని రక్తాన్ని దానం చేయాలని మనమందించే రక్తంతో ఎంతోమంది ప్రాణప్రయస్థితిలో ఉన్న వారిని కాపాడిన వాళ్లమవుతామని,ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్ ల్యాబ్ టెక్నీషియన్స్ ని అభినందించారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య,Acp లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ నందరం అశోక్, మాజీ కౌన్సిలర్ నందకిషోర్,బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నక్కల వెంకటేష్,శివ చారి,దినేశ్ సాగర్,యువసత్తా లక్షణ్ ,Tda జిల్లా ప్రెసిడెంట్ అరవింద్ చారీ ,షాద్నగర్ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ D రాజేష్,సెక్రటరీ ఏ.యాదయ్య,శివకుమార్, ఏ.అమర్, tda సభ్యులు సందీప్ తదితరులు పాల్గొన్నారు.
