ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి
బ్రహ్మకుమారిస్ సమాజ సేవ విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
హాజరైన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ లు బీఆర్ఎస్ నాయకులు
( పయనించే సూర్యుడు ఆగస్టు 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రక్తం అనేది మనిషి ప్రాణాలకు ప్రాణాధారమని కేవలం ఒక మనిషి నుండి మరొకరికి మాత్రమే అందే వరమని,రక్త దానం కంటే గొప్ప దానం మరొకటి లేదన్నారు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి.షాద్ నగర్ పట్టణంలోని విజయనగర్ కాలనీలో విశ్వ బంధుత్వ దినోత్సవ సందర్బంగా బ్రహ్మకుమారిస్ సమాజ సేవ విభాగం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాని ఏర్పాటు చేశారు.ఈ రక్తదాన శిబిరానికి హాజరైన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం చేసి సమాజానికి సేవ చేసే ఆలోచన చేసిన బ్రహ్మకుమారిస్ సమాజ సేవ విభాగా యాజమాన్యం శోభ బాహింజి,లక్ష్మీ బాహింజీ లకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ మదన్ మోహన్ రెడ్డి,బెజిగం రమేష్, మాజీ కౌన్సిలర్ నంద కిషోర్, రెటికల్ నందీశ్వర్,మాజీ సర్పంచ్ యారం శేఖర్ రెడ్డి,బిఆర్ఎస్ నాయకులు రఘుపతి రెడ్డి,నరసింహ రెడ్డి,శ్రీకాంత్ గౌడ్,మాచర్ల మురళి, మంచిరేవుల అశోక్,రమేష్ అగర్వాల్, మాచన్న చంద్రుడు, రామచందర్,చారి,శ్రీపాల్ రెడ్డి,నడికుడ సంతోష్ యాదవ్, కమ్మదానం సందీప్ తదితరులు పాల్గొన్నారు