పోలీసులు ఏం చేస్తున్నారు గొంతుకోసిన దుండగుణ్ణి కఠినంగా శిక్షించాలి బీసీ సేన జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్
( పయనించే సూర్యుడు మార్చ్ 10 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ప్రేమికుడిపై అమ్మాయి వాళ్ల మామయ్య గొంతు కోయడం సిగ్గుచేటు అని బీసీ సేన రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ తీవ్రంగా ఖండించారు.ఈ ఘటనపై స్పందిస్తూ, ఆయన పేర్కొన్నారు: “ప్రజలకు న్యాయం జరిగే స్థలమైన పోలీస్ స్టేషన్లోనే నేరాలు జరుగుతున్నాయి అంటే, అది భద్రతా వ్యవస్థలో ఉన్న లోపాలను వెల్లడిస్తోంది. న్యాయాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఎంతటి పరిస్థితుల్లోనూ సమర్థనీయమికాదు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకొని, బాధితుడికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.” బీసీ సేన డిమాండ్: 1. దాడికి పాల్పడిన నిందితుడిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. 2. పోలీస్ స్టేషన్ భద్రతా ప్రమాణాలను సమీక్షించి, మరింత కట్టుదిట్టమైన నియంత్రణ విధించాలి. 3. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలి. “సమాజంలో శాంతి నెలకొనేలా, న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరగేలా ప్రభుత్వ యంత్రాంగం బాధ్యతగా వ్యవహరించాలి” అని పసుపుల ప్రశాంత్ ముదిరాజ్ అన్నారు.