
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
నంద్యాల స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం (రాజ్ టాకీస్ ) నందు ఆల్ ఇండియా ధోబి మహాసంగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు మరియు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో రజక సంఘం నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లెల్ల శ్రీరాములు మాట్లాడుతూ రజకులపై జరుగుతున్న దాడులను ఆపాలని, రజకులకు రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని , దోబీ ఘాట్లను ఏర్పాటు చేయాలని, రజకుల ఇంటికి 300 యూనిట్స్ కరెంటు ఉచితంగా ఇవ్వాలని, రజకులకు అవసరమైన పనిముట్లను కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారికి అందించాలని, అలాగే దేవాలయాలలో డివిటిలు (లాంతర్లు పట్టేవాళ్ళు) రజకులకు దేవస్థానం కమిటీ మెంబర్ గా అవకాశం ఇవ్వాలని వినతి పత్రంలో కోరారు.. ఈ విషయాలపై మంత్రి ఫరూక్ సానుకూలంగా స్పందిస్తూ పై విషయాలన్నీ సంబంధిత శాఖ అధికారులకు తెలియజేస్తానని అదేవిధంగా మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకొని వెళ్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, సొసైటీ అధ్యక్షుడు యాలూరు వెంకట్ రెడ్డి, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, వీర సింహారెడ్డి, అఖిల భారత రజక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం, గోస్పాడు మండలాధ్యక్షుడు గుండు బాపుల మద్దిలేటి, జిల్లా కార్యదర్శి జూటూరు వెంకటేశ్వర్లు, నాగయ్య, లక్ష్మయ్య, రమణ, శివ,గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు
