చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకెళ్తాం.
వీరనారి చాకలి ఐలమ్మ రజక సంఘం పట్టణ అధ్యక్షులుగా మినలాపురం చెన్నయ్య ఉపాధ్యక్షుడుగా పెళ్లిమెల్లి సురేష్ బాబు ఏకగ్రీవం
జనవరి 12, పయనించే సూర్యుడు బచ్చన్నపేట జనగామ జిల్లా
చాకలి ఐలమ్మ పోరాట పటిమతో మండల కేంద్రంలో రజక సంఘం నూతన కమిటీని నలభై మంది సభ్యులతో కూడిన నూతన కార్యవర్గo నియామకం జరిగింది. అధ్యక్షులుగా మిన్నల్లపురం చెన్నయ్య, ఉపాధ్యక్షులు పెళ్లిమెల్లి సురేష్ బాబును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతు ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే బచ్చన్నపేట మండలం రజక సంఘం గత 50 సంవత్సరాల నుండి మంచి పేరు ప్రఖ్యాతలతో ముందుకు కొనసాగుతుంది అని పేర్కొన్నారు. తమపై ఉంచిన నమ్మకాన్ని సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు. దేవరకొండ మల్లేష్, మిన్నలపురం సిద్ధులు,దేవరకొండ లింగయ్య ,ప్రధాన కార్యదర్శిలు గా దేవరకొండ శ్రీనివాస్, పోచంపల్లివెంకటేష్,కోశాధికారి మిల్లపురంరాజు, సలహాదారులు.పోచంపల్లి రమేష్ బాబు,పోచంపల్లి శ్రీనివాస్(బొంబాయి), దేవరకొండబలరాం, యూత్ ప్రెసిడెంట్ పెళ్లిమెల్లి భరత్ , రజక సంఘం గౌరవ అధ్యక్షులుగా,కమిటీ సమన్వయకర్త మినలాపురం సిద్ధులును ఎన్నుకున్నారు.కార్యక్రమంలో మినలాపురం కనకయ్య, పోచంపల్లి అంజయ్య, మినులాపురం శ్రీధర్, దేవరకొండ మల్లేష్, పెనుబల్లి వెంకటయ్య, మినలాపురం రవి, మినలాపురం సాయిలు, మినలాపురం శ్రీహరి, మిన్నలపూర్ శ్రీను, తదితరులు పాల్గొన్నారు.