
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 27(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం లో భాగంగా మండల కేంద్రం యాడికి నుండి పెద్దపేట వరకు (అవెన్యూ ప్లాంటేషన్) మొక్కలు నాటు కార్యక్రమాన్ని మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు, ఏ.పీ.వో. మద్దిలేటి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఈశ్వర్ రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్లు నాగేశ్వరరావు వెంగల్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.